![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -447 లో.. రామరాజు చేసిన పనికి సాగర్ ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. వద్దని నర్మద ఆపుతుంది. ఏంటి సాగర్ చిన్నపిల్లాడిలాగా అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటావని కోప్పడుతుంది. నువ్వు కూడా నాతో పాటు రావాలని సాగర్ అంటాడు. అత్తయ్య గారు లేని టైమ్ లో ఇలా ఇంట్లో నుండి వెళ్ళిపోతే అత్తయ్య గారు బాధపడుతారని నర్మద అంటుంది. సరే అమ్మ వచ్చాక చెప్పే వెళదామని సాగర్ అంటాడు.
మరొకవైపు అప్పు గురించి ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేసి గొడవ అయ్యేలా చేశామని భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావు ముగ్గురు కలిసి డాన్స్ చేస్తారు. నా కూతురితో కాళ్ళు పట్టించుకుంటుందా అని భాగ్యం అంటుంది. మరొకవైపు ప్రేమకి ధీరజ్ జుట్టు వేస్తాడు. రెండు జుట్లు వేసి దెయ్యంలాగా రెడీ చేస్తాడు. అద్దంలో తనని తాను చూసుకొని ప్రేమ భయపడుతుంది. ఏంట్రా ఇలా రెడీ చేసావని ధీరజ్ ని ప్రేమ కొట్టడానికి వెళ్తుంది. దాంతో ప్రేమను ధీరజ్ పట్టుకుంటాడు. ఇద్దరు రొమాంటిక్ గా చూసుకుంటారు. ఆ తర్వాత చందుకి శ్రీవల్లి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నన్ను తీసుకొని పో.. బావ, నువ్వు లేకుండా నేను ఉండలేనని శ్రీవల్లి అనగానే అయితే చచ్చిపోమని చెప్పి చందు కోపంగా ఫోన్ కట్ చేస్తాడు.
ఆ తర్వాత శ్రీవల్లి కోపంగా కత్తి పట్టుకొని భాగ్యం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటి అమ్మడు అని భాగ్యం అడుగుతుంది. నా భర్త నన్ను చచ్చిపోమన్నాడు.. నేను ఎందుకు చావాలి నా కాపురం ఇలా అవ్వడానికి మీరు కారణం మీరే చావాలని అందుకే అని శ్రీవల్లి అనగానే తనకి భాగ్యం నచ్చజెప్పుతుంది. ఆ తర్వాత రామరాజు జరిగింది గుర్తుచేసుకొని బాధపడతాడు. తరువాయి భాగంలో భాగ్యంకి కాలునొప్పి అయిందని చూడడానికి రామరాజు వాళ్లు వస్తారు. వాళ్లు రాగానే భాగ్యం యాక్టింగ్ చేస్తుంది. కేరళ వైద్యం అంటూ ధీరజ్, నర్మద ఇద్దరు భాగ్యం కాళ్లపై కొడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |